26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పాఠశాలకు వంట సామాగ్రి అందజేత

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : చదువుకునే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కమ్మర్ పల్లీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్మ రంజిత్ అన్నారు. గురువారం కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో వంట చేయడానికి వంట సామాగ్రిని  అందించడం జరిగింది. ముందు ముందు భవిష్యత్తులో ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు, అనాధలకు,అభాగ్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో భారత్ సేవ పురస్కార్ అవార్డు గ్రహీత, కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్, గురిజాల నర్సారెడ్డి, బద్దం దేవేందర్, బక్కురి ఆనంద్, ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్, వంట నిర్వాహకురాలు మౌనమి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article