ఎల్లారెడ్డి, బతుకమ్మ: మనం చేసే రక్తదానం ఎదుటి వ్యక్తికి పునర్జన్మనిస్తుందని మానవ హక్కుల సహాయ సంఘం ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు ద్యావల్ల ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ బాధితురాలికి అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందిన వెంటనే ఆయన ఆస్పత్రికి చేరుకుని రక్తదానంచేశారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో రక్తదానం చేయడంతోపాటు విపత్తుల సమయంలో ముందుకు వచ్చి ఎదుటి వారి ప్రాణాలను రక్షించేందుకు సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు ధ్యావల్ల ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
