29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒక్కరి కోసం అందరూ బలి కావాల్సిందేనా?

Must read

📰 Generate e-Paper Clip

  • పుష్కర కాలం తర్వాత వార్షిక తనిఖీలా?
  • ఐసీపీఎస్ శాఖలో అధికారుల తీరుపై విమర్శలు
  • అవినీతి అక్రమాల విచారణకు పక్క దారి పట్టించేందుకేనా?
  • విచారణ నివేదిక రాక ముందే సిబ్బందిపై వేదింపు చర్యలా?

 

బతుకమ్మ, నిజామాబాద్

ఇంటిగ్రేటెడ్ చెల్డ్ ప్రొటెక్షన్ స్కీంలో (ఐసీపీఎస్)లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆ శాఖాధికారులు షాక్ ఇచ్చారు. 2011-12 ఆర్థిక సంవత్సరం మొదలుకుని 2022-23 సంవత్సరం వరకు చేసిన పని తీరుపై వార్షిక నివేదికలు ఇవ్వాలని నోటిసులు జారీ చేశారు. దాదాపు పుష్కర కాలం తర్వాత తాఖీదులు అందుకున్న ఐసీపీఎస్ ఉద్యోగులు షాక్ కు గురవుతున్నారు. ఐసీపీఎస్ అనుబంధ డీసీపీయూలో ఒక అధికారిపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దానిపై కొందరు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లాలోని ఓ శాఖకు చెందిన అధికారిని విచారణకు నియమించారు. ఈ నెల మొదటి వారంలో సంబంధిత జిల్లా అధికారి డీసీపీయూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హయంలో జరిగిన లైంగిక వేదింపులతో పాటు అక్రమాలపై విచారణ చేపట్టారు. అయితే అక్కడ సంబంధిత యూనిట్ లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని విచారించకుండా కొందరినే విచారణకు పిలువడం వారి వద్ద స్టేట్ మెంట్లు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న అధికారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు సమాచారం. తాత్కాలిక ఉద్యోగిపై జరుగుతున్న విచారణను అడ్డుకునే అవసరం ఏమిటనే చర్చ ఐసీపీయూలో సాగుతుంది. నిజామాబాద్ జిల్లా ఇంటిగ్రేటెడ్  కలెక్టరేట్ లో గల సంబంధిత కార్యాలయంలో విచారణ వ్యవహరం ఇప్పుడు అన్నీ శాఖల్లో తెలిసిపోయింది. తాత్కాలిక ఉద్యోగిగా చేరిన సదరు అధికారి వ్యవహర శైలి నియంతను ఏమాత్రం తీసిపోదనే సంబంధిత ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గా యోగితా రాణా పని చేసిన కాలంలో శిశు గ`హలో చిన్నారుల మరణాలపై సీరియస్ గా వ్యవహరించి విధుల నుంచి తొలగించాలని సంకల్పించారు. అయితే కొందరు అధికారులను మచ్చిక చేసుకుని పైరవీలతో ఆనాడు గట్టెక్కినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. 2014 నుంచి సంబంధిత అధికారి విధి నిర్వహణను రెన్యూవల్ చేశారా? లేదా అనే వ్యవహరం ఇప్పటికి సందిగ్ధంగానే ఉంది. ఇదిలా ఉండగా ఐసీపీఎస్ లో అవినీతి, ఆరోపణలపై జరుగుతున్న విచారణను పక్కదారి పట్టించేందుకే పుష్కర కాలం నాటి లెక్కలను తిరుగతోడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పుష్కరకాలంలో కలెక్టర్లు మారినా, ప్రాజెక్టు డైరెక్టర్లు మారినా గుర్తుకు రాని వార్షిక నివేదికలు ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చాయని వాదనలు ఉన్నాయి. ప్రధానంగా లైంగిక వేదింపులపై ఆధారాలున్న ఇప్పటి వరకు విచారణ నివేదికను అధికారులకు అందించలేదని అందుకే చర్యలు లేవన్న వాదనలున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను నియామకంలో చక్రం తిప్పిన వ్యవహరం ఇప్పుడు కలిసి వస్తుందని వారిలో కొందరు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.

More articles

Latest article