- శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించండి.
. - సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రతి వ్యాపారి తమ దుకాణం ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి కోరారు. సోమవారం సర్వసమాజ్ బిల్డింగ్ లో స్థానిక సిమెంట్, ఎలక్ట్రికల్, ఐరన్ మార్చంట్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రతి షాప్ యజమాని తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తద్వారా పట్టణంలో ఎవరు అనుమానస్పదంగా కనిపించినా, కొత్త వ్యక్తులు సంచరించిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకోవడం సులువవుతుందని అన్నారు.గతంలో ప్రజలు, సర్వసమాజ్, వ్యాపారుల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దాదాపు పనిచేయడం లేదని, వాటి నిర్వహణ కూడ భారం అవుతుందని అన్నారు. ఊరంతా కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వహణ లేక పోవడం తో అవి పని చేయక ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అలా కాకుండా ప్రధాన కూడళ్ళలో ఉన్న షాప్ లోపల, బయట కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణ సులభం అవ్వడం తో పాటు నేరస్తులను, దొంగలను పట్టుకోవడం తో పాటు శాంతి భద్రతల పరిరక్షణ లో కీలక పాత్ర వ్యాపారులు పోషించిన వారు అవుతారని అన్నారు. సీసీ కెమెరాలు పట్టణం లోని అన్ని వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేయడం ద్వారా పట్టణం అంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతుందని పేర్కొన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆయా ఏరియా లో ని సీసీ కెమెరాలు పరిశీలన చేయడం ద్వారా పోలీసులకు కేసు లు చేదించడం సులభం అవుతుందన్నారు. శాంతి భద్రతలు, పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు సర్వసమాజ్ తీసుకుంటున్న నిర్ణయానికి వ్యాపారులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి ఉపాధ్యక్షుడు బార్ల మోహన్ క్యాషారు కాపు కుమారి హరీష్ సలా కమిటీ సభ్యులు తోపారం సురేందర్ సుధాకర్ పాల్గొన్నారు.