- ఏసిపి శ్రీనివాస్
బతుకమ్మ, కోటగిరి : అపరిచితులకు ఆశ్రయం కల్పించడం కానీ పని కల్పించడం కానీ చేయవద్దని ఏసీబీ శ్రీనివాస్ వెల్లడించారు. పోతంగల్ మండలం జాల్లపల్లి ఫారం గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిపి ఆదేశాల మేరకు ప్రతి నెల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుందని. మన గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దు రాష్టం కావడంతో ఉన్న దొంగతనాలు కానీ ఇతర పనులు ఇల్లీగల్ పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.. కావున గ్రామాల్లోకి కొత్తగా వచ్చిన వారి బయోడేటాను పూర్తిగా తెలుసుకొని వారికి పనులు గాని ఉండడానికి రూములు కానీ వారి పూర్తి వివరాలను తీసుకొని ఇవ్వాలని పేర్కొన్నారు. లేకపోతే అలాంటి వారి వల్ల చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని సరియైన పత్రాలు లేని యాభై రెండు బైక్లను , మూడు టాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.. కార్యక్రమంలో రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ రూరల్ సిఐ విజయబాబు,బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ, స్థానిక ఎస్సై సునీల్, రుద్రూర్ ఎస్సై సాయన్న గ్రామస్తులు పాల్గొన్నారు.
