27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపొద్దు

Must read

📰 Generate e-Paper Clip

స్టేట్ టీచర్స్ యూనియన్

నిజామాబాద్, బతుకమ్మ :  ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపొద్దని స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశఆరు. గత 20 రోజులుగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరానికి శుక్రవారం స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్య వర్గ సభ్యులు సందర్శించి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ కేజీబీవీలకు ఉపాధ్యాయులను డిపుటేషన్ పై పంపే ఉత్తర్వులను వెంటనే నిలిపి వేయాలని కోరారు. ఇన్ని రోజులు వారు చేస్తున్నా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావొద్దని, ఎవ్వరూ కూడా కేజీబీవీ పాఠశాలకు డిపూటేషన్ పై  పోవద్దని  ఉపాధ్యాయులను కోరారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లు కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొని రావొద్దని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ఉద్యోగులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. .మ్యానిఫెస్టోలో ఇచ్చినవిదంగా హామీలు నెరవేర్చాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్, కాంత రావు,చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article