23.7 C
Hyderabad

భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

యువత గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారుల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మోర్తాడ్ ఎస్సై  బి. రాము పిలుపునిచ్చారు. మన ఊరు – మన భద్రత కార్యక్రమంలో భాగంగా గురువారం మోర్తాడ్ ఎస్సై బి. రాము ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మండల కేంద్రం లో పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అనంతరం మత్తు పదార్థాల నష్టాలపై విద్యార్థుల కు, గ్రామస్తులకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మోర్తాడ్ సర్పంచ్ ఆనంద్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Do not ruin your future.

More articles

Latest article