ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని సర్కిల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
