28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పి సింధుశర్మ

Must read

📰 Generate e-Paper Clip

స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

 కామారెడ్డి, బతుకమ్మ: 

 కామారెడ్డి జిల్లా ఎస్పీ  సింధూ శర్మ రాజంపేట్ పోలిస్ స్టేషన్ ను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది పని తీరు గురించి తెలుసుకున్నారు . పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను తెలసుకొని, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్ , బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని 100 డయల్ కాల్స్ వస్తే తక్షణమే స్పందించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు, పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామాలలో విధిగా పర్యటించాలని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు సైబర్ నేరాల పట్ల, సైబర్ నేరగాలు చూపే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు , భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ , ఎస్సై పుష్పరాజ్  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.District SP Sindhusharma made a surprise inspection of Rajampet police station

 

 

More articles

Latest article