రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పి సింధుశర్మ

స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి  కామారెడ్డి, బతుకమ్మ:   కామారెడ్డి జిల్లా ఎస్పీ  సింధూ శర్మ రాజంపేట్ పోలిస్ స్టేషన్ ను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది పని తీరు గురించి తెలుసుకున్నారు . పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను తెలసుకొని, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు...