27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హోంగార్డ్ కి అండగా నిలిచిన జిల్లా పోలీస్ యంత్రాంగం

Must read

📰 Generate e-Paper Clip

  • 55 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ కి జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా (55,000/- రూపాయలు) జమచేసి వారి కుటుంబా సభ్యులకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా శివకుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి,రమేష్,శివకుమార్ కుటుంబ సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article