29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉప్పల్ వాయి గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

 

సదాశివనగర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి మొత్తం 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో ఇప్పటికే 10 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 15 ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉప్పల్ వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు సైన్స్ ఫెయిర్స్ వంటి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారని ప్రశంసించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, విజ్ఞాన సంబంధిత కార్యక్రమాల్లోనూ మంచి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసే విధంగా బోధన కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ కనకంటి శివారాణి రాజేందర్, ఉప సర్పంచ్ పార్వరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, పంచాయతీ కార్యదర్శి అరుణ్, ఎంపీడీవో నాగేశ్వర్, ఎమ్మార్వో ఉమలత, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

More articles

Latest article