ఎల్లారెడ్డిపేట బతుకమ్మ: ఈ నెల 19,20,21 తేదీలలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ ఎక్స్ పో హైదరాబాదులోని నర్సింగి ఓం కన్వెన్షన్ లో జరిగే ఎగ్జిబిషన్ వివరాల పోస్టర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సోమవారం సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కార్యదర్శి ముత్యాల ప్రభాకర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండి హాజీముద్దీన్ లు మాట్లాడుతూ ఫోటో ట్రేడ్ ఎక్స్పో గ్రామీణ ప్రాంత ఫోటో, వీడియో గ్రాఫర్స్ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కొత్త కొత్త కెమెరాలు, టెక్నాలజీలు, ఏ ఐ టెక్నాలజీ లాంటి అంశాలను నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మిక్సింగ్ యూనిట్స్, ఆల్బమ్ డిజైనర్స్,ల్యాబ్ ప్రింటర్స్,వారికి కూడా కొత్త కొత్త పరికరాలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.గ్రామీణ,పట్టణ ప్రాంత ఫోటో వీడియో గ్రాఫర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కార్యదర్శి ముత్యాల ప్రభాకర్ రెడ్డి, అధ్యక్షులు మహమ్మద్ అజీముద్దీన్, ప్రధాన కార్యదర్శి పెంజర్ల తిరుపతి యాదవ్, మహమ్మద్ షాదుల్ , ఉపాధ్యక్షులు మారోజు కుబేర స్వామి , షాడా శేఖర్ రెడ్డి,మారోజు నరసింహ చారి , బసవపురం కృష్ణ , వేముల శ్రీధర్ తో పాటు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
