- ప్రమాదంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్
- స్పందించని సర్కారుపై కంచర్ల రవిగౌడ్ ఆగ్రహం
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్‌పై చూపుతున్న నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో ఉందని,కాలేజీలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “పది వేల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని,పేద విద్యార్థులను చదువుల నుంచి దూరం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తోందనే అనుమానం కలుగుతోంది’’ అని మండిపడ్డారు. కరోనా కాలంలోనూ విద్యార్థుల కోసం ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేసిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దేనని గుర్తుచేశారు. “ఎన్నికల హామీగా ఫీజు బకాయిలు లేకుండా చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు’’ అని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని కాలేజీ యాజమాన్యమే బంద్ చేసే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాలేజీ యాజమాన్యం బందుకు పిలుపునిచ్చిన సర్కార్ స్పందించలేదని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా వెంటనే బకాయిలో ఉన్న ఫీజులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేనియెడల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే అప్రోచ్, కోడం వెంకటేశం,భూత్కూరి శివరాజ్, కాసాల్రా శ్రీనివాస్,మలవోత్ రాకేష్ నాయక్,గోతుల తిరుపతి, అక్రమ్, మహేష్,నరేష్,శివ తదితరులు పాల్గొన్నారు.
