నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ లో మే 3న జరగనున్న నీట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలియ తిరిగి కళాశాల అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాఫీగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...