నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : శ్రీ ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. మొదట పూజా కార్యక్రమం అనంతరం

“అన్నదాన కార్యక్రమం” లో పాల్గోని వచ్చినటు వంటి వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ అన్నదాన కార్య క్రమంలో పెద్ద మొత్తంలో స్నేహా సొసైటీ విధ్యార్దులు , మరియు పోలీస్ సిబ్బంది, సామన్య ప్రజలు హారయ్యారు. ఈ కార్యమ్రం లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దిలిప్, అదనపు డి.సి.పి (అడ్మిన్) జి.బస్వా రెడ్డి , రాజశ్రీ , ఫిషారీస్ శ్రీ ఆంజనేయులు , నిజామాబాద్ టౌన్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , రిజర్వు ఇన్స్పెక్టర్స్ లు , ఆర్.ఎస్.ఐలు , ఏ.ఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది , పోలీస్ కార్యాలయం సిబ్బంది , పోలీస్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

