నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 10వ జాతీయ ఓబీసీ మహసభలకు నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఝండా ఊపి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్…. మరియు గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి బీసీ నేతల ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. గోవా లో జరుగనున్న 10వ ఓబీసీ జాతీయ మహాసభలకు పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో బయల్దేరిన వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల మేలు కోరే ప్రభుత్వం అని తాహెర్ బిన్ అందాన్ అన్నారు. బీసీ లు అన్ని రంగాల్లో రాణించాలంటే 42% రిజర్వేషన్లు రావాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను కేంద్రం వెంటనే ఆమోదించాలని అన్నారు. బీసీలు సామాజిక ఇంజినీర్లు అని గ్రంథాలయ ఛైర్మన్ అన్నారు. బీసీలకు సముచిత అవకాశాలు వచ్చిన నాడు వారితో పాటు దేశం కూడ ఇంకా అభివృద్ధి చెందుతదనీ అన్నారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బీన్ హందాన్, అంతరెడ్డి రాజరెడ్డి, గంగారెడ్డి, నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, బుస్స ఆంజనేయులు, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్, కొయ్యాడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, నారాయణ రెడ్డి, కోడూరు స్వామి, బసవ సాయి, అన్నయ్య, విజయ్, జయ, రుక్మిణీ, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
