మోర్తాడ్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలలో తో పాటు విద్యా ప్రభుత్వ రంగాలలో తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదని అగ్రనేత రాహుల్ గాంధీ ఇచిన మాటప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ పెట్టీ ఆమోదింపజేసిన తరవాత టీఆర్ఎస్ అదినేత కేసీఆర్ ఈ నెల 8 న కరీంనగర్ లో బీసీ గర్జన కార్యమము పెట్టారు. అంటే కేసీఆర్, కేటీఆర్ వెన్నులో చఆలి పుట్టిందని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు.సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజా నీలయంలో జరిగిన పత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏనాడు బీసీల అభ్యున్నతి కోసం మాట్లాడని నాయకులు గర్జనల పేరుతో బీసీలకు దగ్గర కావాలని చూస్తున్నారని కానీ మిమ్మల్ని మీ పార్టీనీ నమ్మే పరిస్తితులలో తెలంగాణలో బీసీలు లేరన్నారు గతంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను తప్పుదారి పట్టిస్తున్నాడాని ఇది స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అని మాట్లాడిన కేటీఆర్ మరి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు టిఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ అని. ఆ నావలో బీసీ నాయకులు ఎవరున్నా మునిగిపోతారని అన్నారు. అందుకే బీసీల రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించే విధంగా సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనీ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక బీసీ నేత పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పేద ప్రజలకు సంక్షేమ పతాకాలను వివరించడానికి వారి సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా పాదయాత్ర చేస్తుంటే అది మింగుడు పడని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ గౌడ్ దేనికోసం పాదయాత్రలు అధికారంలోకి పాదాతలు చేస్తారా అంటూ మాట్లాడుతున్నాడని ఒక బీసీ నాయకుడు జిల్లా వాసి పాదయాత్రలు చేస్తుంటే మీరు భరించలేరా అని ప్రశాంత్ రెడ్డి ని ప్రశ్నించారు. మీ అధినేత కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు అసెంబ్లీలోకి కి రాడు మేము పాలక పక్షము లో ఉండి కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మీ పదేళ్ల కాలంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 22% దించిన గనుడు కేసీఆర్ అయితే ఈబీసీ కోట తీసుకొచ్చిన బిజెపి ప్రభుత్వం బీసీల నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసిన మరో మోసగాడు నరేంద్ర మోడీ అన్నారు. బీసీల విషయంలో టిఆర్ఎస్ బిజెపి ఒకే విధానమని రాజకీయంగాను రిజర్వేషన్లలోను ఆది నుంచి మోసం చేస్తున్నది ఈ రెండు పార్టీలనేనని ఆరోపించారు. బీసీలకు రాజకీయ ఫలాలు సంక్షేమ పథకాలు 42 శాతం రిజర్వేషన్లు అందించే విధంగా కృషి చేస్తున్నది చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మే అని అన్నారు. ఈనెల 6న చేపట్టిన 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంటులో ఆమోదించాలని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్మ కార్యక్రమమూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీమంత్రులు పాల్గొంటున్న ఈ కార్యక్రమమూలో బిసి విద్యావంతులు మేధావులు ఉధ్యమకారులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఏర్గెట్ల మండలం అధ్యక్షులు ముత్యాల రాములు దేవా రెడ్డి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య డిసిసి ఉపాధ్యక్షులు శివనోళ్ళ శివకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూత్ పురం మైపాల్ ఆనంద్ రంజిత్ మహమ్మద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
