భీమ్ గల్, బతుకమ్మ :
మండలంలోని గోనుగొప్పుల ప్రైమరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థుల లక్ష్మీ చేయూత సేవా సంస్థ నిజామాబాద్ వారు పాఠ్య పుస్తకాలను అందజేశారు. పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించిన ఈ సేవ సంస్థ త్వరలో పాఠశాలకు జిరాక్స్ మిషన్ కూడా ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చరణ్ గౌడ్, లక్ష్మి చేయూత సంస్థ సెక్రటరీ ఎస్ .శ్రీనివాస్, క్యాషియర్ ఏ.లక్ష్మణ్, సభ్యులు టి.శ్యాం కుమార్, ఎస్.ఆర్.భూమేశ్వర్, ఎన్.బోజాగౌడ్, గట్టు భూమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
