28.2 C
Hyderabad

జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పాఠ్య పుస్తకాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్,:-మండలంలోని కుకునూర్, పడగల్, మోతే ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి. హరిచరణ్, వైద్య గణేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దాసరి వనిత,గ్రామ అభివృద్ది కమిటీ చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మట్లాడుతూ ఆరో తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేడు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడుతున్న ఈ పాఠ్యపుస్తకాలు నాణ్యమైనవని,వీటిని చిరిగిపోకుండా విద్యార్థులు కాపాడుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెంట తీసుకొని వచ్చి,శ్రద్ధగా విద్యను అభ్యసించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుకునూర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, మోతే పాఠశాల ఉపాధ్యాయ బృందం, పడగల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం,గ్రామ అభివృద్ది కమిటీ స్పీకర్లు జగదీశ్వర్ రెడ్డి, సాయిరాం,సభ్యులు  విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article