మెండోరా బతుకమ్మ: మెండోరా మండలంలోని బుస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ముప్కాల్ పాండురంగ బుక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పదివేల రూపాయల విలువగలనోటు పుస్తకాలను, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను అందజేశారు. మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శమంత పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పాండురంగ బుక్ డిపో యజమానులు రామరాజు, ఉమేష్ లకు ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ రమేష్, ఉపాధ్యాయులు కవిత, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.
