29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీ విద్యార్థి సంఘం

 

బతుకమ్మ, బోధన్ : బోధన్ డివిజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులను నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరివెసు సంతోష్ డిమాండ్ చేశారు. అనుభవం లేని డ్రైవర్‌లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేకుండా, ఎమర్జెన్సీ డోర్లేని బస్సులు నడుస్తున్నాయని ఆరోపించారు. భారీగా ఫీజులు వసూలు చేస్తూ, పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలిస్తూ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని బోధన్ RTO కార్యాలయంలో MVI డి. శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు నరేష్, గంగాధర్, సాయి కుమార్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article