కామారెడ్డి, బతుకమ్మ : సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ కి కొత్త మొబైల్స్ మంత్ర ఫింగర్ప్రింట్ డివైస్ అండ్ స్క్రీన్ గార్డ్ అడాప్టర్ పంచ్ అండ్ కేబుల్ పూర్తి సెట్ ను పంపిణీ చేయడం చేశారు. మొత్తము 211 సెట్స్ జిల్లాకు రావడం జరిగింది. ఈ మొబైల్స్ ఉపయోగించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఫేస్ రికగ్నైజేషన్ రానియెడల మంత్ర డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. వీటి ద్వారా పెన్షన్ పంపిణీ నేరుగా లబ్ధిదారులకు చేరుతుంది. అంతేకాకుండా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి పెన్షన్ వారే నేరుగా వచ్చి తీసుకొనడానికి ఒక మంచి సదవకాశం ను ఈ ప్రభుత్వం పెన్షనర్స్ అందరికీ కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషన్ కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, డిఆర్డిఓ సురేందర్, అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, టీజీ ఆన్లైన్ డిస్టిక్ కోఆర్డినేటర్, డిపిఎం పెన్షన్స్ శోభా రాణి పాల్గొన్నారు.
