31.8 C
Hyderabad

మట్టి గణపతుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. బీసీ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, మట్టి గణపతులను అధికారులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతుల కంటే మట్టి గణపతుల వినియోగం సమాజానికి మేలు చేస్తుందని, పాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయకులను నీటి వనరులలో నిమజ్జనం చేసినప్పుడు  మీరు కలుషితమై  నివసించే ప్రాణులకు  ప్రాణహాని కలవడంతోపాటు, ఆ నీటిని ఉపయోగించే మనుషులు, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ఫలితాలను కలగ చేస్తుంది కాబట్టి    వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని  విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article