బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన 41మందికి, నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 32 మందికి, మోస్రా మండలానికి చెందిన 31 మందికి చెక్కులను పంపిణీ చేశఆరు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా,ఆయా మండలాల ఎమ్మార్వో లు, బాన్సువాడ పట్టణ,బాన్సువాడ గ్రామీణ ,నసురుల్లాబాద్, మోస్రా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

