24.1 C
Hyderabad
Monday, August 3, 2026

నిరుపేద పెయింటింగ్ కళాకారుడికి నిత్యావసర సరుకుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ పెయింటింగ్ కళాకారులుగా పనిచేసి ప్రమాదవశాత్తు పెయింటింగ్ చేస్తూ ప్రమాదానికి గురయిన నిరుపేద పెయింటర్ బ్రహ్మ ను ఆదివారం పరామర్శించి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, 8000/-ల ఆర్థిక సహాయం చేశారు. సీనియర్ వయోభారంతో ఇబ్బందులు పడుతున్న మరో పెయింటర్ ప్రకాశ్( సన్ ఆర్ట్స్) ని పరామర్శించి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం బుసి ఆర్ట్స్ గా సేవలందించి మృతి చెందిన మరో సీనియర్ పెయింటర్ కళాకారుడు అనంత కృష్ణ స్వామి కి సంతాప సభ ఏర్పాటుచేసి ఆయన చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పెయింటింగ్ కళాకారులుగా సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కళాకారులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు కిషన్, మహదేవన్, చారి, లింబూరి  లక్ష్మణ్, వేణు, సాయిబాబా, శ్రీను, శెట్టి, చందు, గంగాధర్, హన్మండ్లు, రాజు, బలవీర్, గణేష్,రాజ్ కుమార్, దేవ, రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article