29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యవసర వస్తువులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

  • వరద బాధితులను పరామర్శించిన దినేష్ కుమార్

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇటీవల గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఇందల్వాయి మండలంలోని  జీకే తండాలో  ఇండ్లలోకి నీరు భారీగా రావడంతో తాండవాసులు భారీగా నష్టపోయారు. బాధితులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్,మండల అధ్యక్షులు లోలం  సత్యనారాయణ ఆధ్వర్యంలో జీకే తాండ వాసులను శనివారం పరామర్శించారు.బాధితులకు ఎంపీ అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యవసర వస్తువులను అందజేశారు.అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ మాట్లాడుతూ  భారతీయ జనతా పార్టీ  ప్రజల  సమస్యల పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు. జీకే తాండ గ్రామస్తులు అరవింద్ ఫౌండేషన్ సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ  మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ,నాయుడు రాజన్న రాజేందర్ శేఖర్ శ్రావణ్ సవిత. కేపి రెడ్డి నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article