- తొమ్మిది రోజులుగా హాస్పత్రిలో మృత్యువుతో పోరాటం
- సాయిలు మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో సేవలల్ మందిరం వద్ద గత తొమ్మిది రోజుల క్రితం విద్యుత్ స్తంభం ఎక్కిన మల్టీపర్పస్ కార్మికుడు ఎడపల్లి చిన్న సాయిలు(41)కు అకస్మాత్తుగా మెయిన్ లైన్ విద్యుత్ షాక్ తగలడంతో భారీ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఒకే స్తంభానికి రెండు లైన్లు ఉండడం, ప్రమాదం జరగడంతో నిజామాబాద్ జిల్లా మనోరమ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన చిన్న సాయిలుకు ఇక చేయి తీసివేయగా గత తొమ్మిది రోజుల నుండి హాస్పత్రిలో మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం తుది శ్వాస విడిచాడని బంధువులు తెలిపారు. కుటుంబానికి ఉన్న ఒక దిక్కు సాయిలు మృతి చెందడం పట్ల భార్య పిల్లలు రోదిస్తూ తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. సాయిలు ప్రమాదం పట్ల కారకులైన వారి పైన చర్యలు తీసుకొని సాయిలు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
