మోర్తాడ్,బతుకమ్మ: ఆరోగ్యమే మహా భాగ్యమని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు వ్యాయామం, యోగ వంటి కార్యక్రమాలు చేయాలని ఎమ్ ఎల్ హెచ్ పి లావణ్య అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో మంగళవారం ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానికులకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానికులతో యోగా ఆసనాలు వేయించి వాటి యొక్క ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం దీప, ఆశ వర్కర్లు లావణ్య, లలిత, సుమలత, సరిత, గురిజాల నర్సారెడ్డి, నలూరు గంగాధర్, సుభాష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

