27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలోని కొంత మంది లబ్ధిదారులకు సుమారు 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజ్యం రవికుమార్  తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. గ్రామంలోని దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి లబ్ధిదారుడు మెరుగైన చికిత్స పొందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ను అందిస్తున్నారని ఆయన విలేకరులతో  అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమీ లేని నిరుపేదలతో పాటు నిరుపేదలు కార్పోరేట్ వైద్యం.నాణ్యమైన వైద్యం అందించాలని సంకల్పంతో సీఎంఆర్ఎఫ్ ఫండ్ ను నిరుపేదలకు అందిస్తున్నారని ఆయన వివరించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.వికలాంగుల హక్కుల పోరాటసమితి మండల అధ్యక్షుడు ఇమ్మడి సాయిలు.మాజీ ఎంపిటిసి జంగిడీ లక్ష్మీ.. గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు నవీన్ చౌదరి. నర్సయ్య.తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article