24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కుట్టు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో గత సంవత్సరం నుండి విశ్వహిందూ పరిషత్, వసుధ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మాతృమూర్తులకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 120 మంది శిక్షణ పొందారని, అందులో నుండి ఇప్పటి బ్యాచ్ 40 మందికి బీజీపీ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మలా సత్యం, విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహా కార్యదర్శి చింతల వెంకన్న, ప్రాంత సేవా ప్రముఖ్ రాజేందర్ రెడ్డి, విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ ముఖ్య అతిధులుగా విచ్చేసి వారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత కృషి ప్రముఖ్ దాత్రిక రమేష్, జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చెటర్జి, కుట్టు మిషన్ శిక్షకురాలు శ్యామల, 40 మంది మహిళలు పాల్గొన్నారు.

Distribution of certificates to those who have completed sewing training

More articles

Latest article