విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ
భీమ్ గల్, బతుకమ్మ : శీతాకాలం కారణంగా చలి తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ భీమ్ గల్, వేముగళ్ళు ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పడాల పురందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. “రేపటి పౌరులు అయిన విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, చలి బాధను మరిచిపోయి, కేవలం చదువుపై మాత్రమే దృష్టి సాదించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం...