- పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని “మోడీ కానుక” పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ బడులలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు.అందులో భాగంగా బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 108 సైకిళ్లు,రాచర్ల తిమ్మాపూర్ లో 21 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలకు సమయానికి వెళ్లేందుకు బండి సంజయ్ కుమార్ ముందు జాగ్రత్తగా ఆలోచించి విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సైకిల్లను ఉపయోగించుకొని పాఠశాలకు సమయానికి వెళ్లి మంచిగా చదివి అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కృష్ణ హరి, పాఠశాల ఎచ్ ఎం మధు మాలతి, బీజేపీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్,నంది నరేష్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ ప్రకాష్,సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు బాలా గౌడ్, కొండాపురం సత్యం రెడ్డి,వంగల రాజు ,సీనియర్ నాయకులు ఉడుగుల యాదగిరి,బందరపు లక్ష్మారెడ్డి,పిట్ల శ్రీశైలం,వంగ బాపురెడ్డి,సింగర వేణి కృష్ణ హరి, రంజింత్, మూడవత్ రవీందర్, దండు నవీన్, కొండ ప్రశాంత్, డాక్టర్ సతీష్, సత్తయ్య,మధు, సంతోష్, రాకేష్ , గణేష్, రమేష్ నాయక్, ప్రవీణ్, బీజేపీ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, బూత్ అధ్యక్షురాలు జోనాకంటి తేజశ్రీ,ఇలెందుల జ్యోతి, మంజుల,విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

