బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 23,826 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ రెండు గేట్ల ద్వారా 6248 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. సాయంత్రం 4:30 నిమిషాలకు ఒక గేట్ మూసి వేయడం జరిగింది. కాకతీయ కాలువ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.501 టిఎంసిల నీరు నిలువ ఉంది.
