27.2 C
Hyderabad

వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

The quality of power supply to the agricultural sector must be continuously monitored

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్ లను పరిశీలించిన సీఈ నాగప్రసాద్

 డిచ్ పల్లి/ భీంగల్, బతుకమ్మ:

వినియోగదారులు, రైతులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్‌ సరఫరా అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఈ కమర్షియల్ ( వరంగల్) జి. నాగప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని డిచ్‌పల్లి 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను  సిఈ కమర్షియల్ జి నాగ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్లలోని అన్ని 33 కేవీ ఫీడర్ల లోడ్లు, విద్యుత్‌ సరఫరా పరిస్థితి, వోల్టేజ్‌ స్థాయిలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని ఎస్పీఎం విభాగం, ప్రైవేట్  ఎస్ పి ఎం షెడ్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పరిస్థితి, పరికరాల పనితీరు, నిర్వహణ అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భీమ్‌గల్ 220/132/33 కేవీ సబ్‌స్టేషన్, 33/11 కేవీ సబ్‌స్టేషన్, భీమ్‌గల్‌లోని ప్రైవేట్ ఎస్ పిఎం షెడ్‌ను,ఆర్మూర్  డివిజన్‌లోని ఎస్ పిఎం షెడ్‌ను పరిశీలించి విద్యుత్‌ సరఫరా, పరికరాల పనితీరు, నిర్వహణ అంశాలను సమీక్షించారు.  వ్యవసాయ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయానికి అందుతున్న విద్యుత్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందేలా చర్యలు చేపట్టాలని సీఈ సూచించారు. ఫీడర్ల పై పెరుగుతున్న లోడ్ లను ముందుగానే గుర్తించి అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.విఫలమైన డీటీఆర్‌లను గుర్తించిన వెంటనే ప్రత్యామ్నాయ డీటీఆర్‌లను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. విఫలమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఆలస్యం లేకుండా మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.33 కేవీ ఫీడర్ల లోడ్లు, సబ్‌స్టేషన్ల పనితీరు, డీటీఆర్‌ల స్థితిగతులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఈ నాగప్రసాద్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రైతులు, వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్ ఈ ఆపరేషన్  నిజామాబాద్ పి.వి. రాజేశ్వరరావు పాల్గొన్నారు.

The quality of power supply to the agricultural sector must be continuously monitored
The quality of power supply to the agricultural sector must be continuously monitored

More articles

Latest article