29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దివ్యాంగులు సమాన హక్కులతో ముందుకు రావాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దివ్యాంగులు సమాజంలో వెనుకబడిన వర్గంగా కాకుండా సమాన హక్కులతో ముందుకు రావాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌ జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఆటో, వీల్‌చైర్స్‌ తో పాటు పలు సహాయక ఉపకరణాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ధన్ పాల్ సత్యనారాయణ, రాకేష్ రెడ్డి, కూడ చైర్మన్ కేశ వేణు, నగర మేయర్ ఉమారాణి, రాజీవ్ మెమోరియల్ యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ అధ్యక్షులు ఎల్లంకి అభిలాష్ (అభి నాని), కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

Disabled people should come forward with equal rights

More articles

Latest article