23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

అమల్లోకి  డైట్ కాస్మోటిక్ చార్జీలు

Must read

📰 Generate e-Paper Clip

  •  టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ 

బతుకమ్మ,మెండోరా: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లల్లో పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ హాస్టళ్లల్లో పర్యటించారు. బాల్కొండ మండల కేంద్రంలోనూ.. పోచంపాడు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు . ప్రభుత్వం అందిస్తున్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను.. విద్యార్థుల తల్లిదండ్రులను అడిగారు. భోజనం విషయంలో విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను.. నాణ్యమైన విద్యను అందించేందుకు తీసుకుంటున్న చర్యలను అనిల్ కుమార్ వివరించారు. పేదరికం నుంచి కుటుంబాలు బయటపడాలంటే విద్యే మార్గమన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్నారు.పేద విద్యార్థులకు విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. కూలీల పిల్లలూ కూలీలుగానే బతకాలనే కుత్సిత స్వభావంతో గత ప్రభుత్వం ఉండేదని మండిపడ్డారు అనిల్. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి స్కూళ్లను అభివృద్ధి చేయడమే తప్ప.. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. పేద విద్యార్థుల సంక్షేమం.. వారికి నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచామన్నారు అనిల్ కుమార్. గత ప్రభుత్వ హయాంలో సుమారు 6 వేల స్కూళ్లు మూతపడ్డాయని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. వాటిని తెరిపించామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి డీఎస్సీ నిర్వహించి టీచర్లను నియమించేదని, దాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. టీచర్లను నియమించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నామని.. త్వరలోనే ఆ కల సాకారం కాబోతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కిరాయి భవనాల్లో గురుకులాలు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధలు తప్పించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Diet cosmetic charges in force

స్టూడెంట్ మోటివేటర్ అవతారమెత్తిన అనిల్ కుమార్..

టీజీఎండీసీ ఛైర్మనుగా వ్యవహరిస్తోన్న అనిల్ కుమార్.. తన హాస్టళ్ల సందర్శన సందర్భంగా స్టూడెంట్ మోటివేటర్ అవతారమెత్తారు. ఏదో సాధారణ రాజకీయ నేత తరహాలో కాకుండా.. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా అనిల్ వ్యవహరించారు. పిల్లల్లో స్టేజ్ ఫియర్ తగ్గించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని టీచర్లకు సూచనలు చేశారు. అలాగే పిల్లలతో కలివిడిగా మాట్లాడుతూ.. వారిని స్టేజ్ మీద నుంచి మాట్లాడాల్సిందిగా ప్రొత్సహించారు. స్టేజ్ ఫియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే విద్యార్థులు పెరిగి పెద్దయ్యాక ఏ రంగంలోనైనా రాణిస్తారని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో సుమారు పావు గంట సేపు ఇంటరాక్ట్ అయ్యారు. కార్యక్రమం లో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి, నాయకులు మాజీ సర్పంచ్ రమేష్ , వాహబ్, బాలు,  ప్రసాద్,  తదితరులున్నారు.

Diet cosmetic charges in force

More articles

Latest article