బోధన్, బతుకమ్మ: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి ఇటీవల కాలంలో పీహెచ్ సీని సందర్శించారా? అని సాలూర పీహఎచ్ సీ సిబ్బందిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశ్నించారు. పీహెచ్ సీని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఆస్పత్రిలో సదుపాయాలను పరిశీలించారు. మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి వైద్య సేవల గురించి వాకబు చేశారు. సమయ పాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. శిథిల దశకు చేరుకున్న పీ.హెచ్.సీ పాత భవనాన్ని పరిశీలించిన కలెక్టర్.. కొత్త భవనం మంజూరు వివరాల గురించి ఆరా తీశారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ తదతరులు ఉన్నారు.

