25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సీజేఐ బీఆర్ గవాయి మీద దాడికి నిరసనగా ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద జరిగిన దాడి పై అంబేద్కర్ సంఘాలు ఖండిస్తూ బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. కిషోర్ రాజేష్ అనే సీనియర్ న్యాయవాది అత్యున్నత హోదాలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ బీ ఆర్ గవాయి మీద దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ అని అభివర్ణించారు. కొంత సేపు రోడ్డు పై మోకాళ్లపై ఉండి నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన అంబేద్కర్ సంఘ నాయకులు ర్యాలీగా మోర్తాడ్ తాశీల్ ల్దార్ కార్యాలయానికి వెళ్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పలు గ్రామాల అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dharna protest against attack on CJI BR Gavai

More articles

Latest article