సీజేఐ బీఆర్ గవాయి మీద దాడికి నిరసనగా ధర్నా
మోర్తాడ్, బతుకమ్మ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద జరిగిన దాడి పై అంబేద్కర్ సంఘాలు ఖండిస్తూ బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. కిషోర్ రాజేష్ అనే సీనియర్ న్యాయవాది అత్యున్నత హోదాలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ బీ ఆర్ గవాయి మీద దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ అని అభివర్ణించారు. కొంత సేపు రోడ్డు పై మోకాళ్లపై ఉండి నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అనంతరం...