29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసిన దేవ్ జీ

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:

 

మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటి కార్యదర్శి దేవ్ జీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసారు. 1984 లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో విప్లవోద్యమంలోకి అడుగు పెట్టారు దేవ్ జీ. ఆనాడు ఇంటర్ పరీక్షలలో కొన్ని సబ్జెక్ట్ లు తప్పడంతో ఇంటర్ బోర్డు అనుమతితో మంగళవారం సప్లీమెంటరీ పరీక్షకు హాజరయ్యారు. ఆనాడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో ఆర్గనైజర్ గా ఉండటంతో ఇంటర్ లో తెలుగు పరీక్ష తప్పినట్లు సమాచారం. ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల తరువాత లా చదివి పేదలకు న్యాయసహాయం చేస్తానని దేవ్ జీ పేర్కొన్నారు. దాదాపు 42 సంవత్సరాల తరువాత జన జీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ ఇంటర్ పరీక్షలకు ట్యూషన్ చెప్పించుకుని పరీక్షలకు హాజరు కావడం గమనార్హం.

 

Dev Ji wrote the Inter Supplementary Exam.

More articles

Latest article