31.3 C
Hyderabad

గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌ సస్పెన్షన్‌ !

Gambhiraopet SI Srikanth suspended!

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విధుల నిర్లక్ష్యం, విలేకరుల పై థర్డ్‌ డిగ్రీ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్‌ చేస్తూ మల్టీజోన్‌-1 ఐజీ, జోన్‌-3 రాజన్న ఇన్‌చార్జి డీఐజీ ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు, జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ వచ్చిన ఆరోపణలు ఈ చర్యలకు నేపథ్యంగా నిలిచాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టి ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు పడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article