ఏర్గట్ల పాఠశాలను సందర్శించిన డీఈఓ
బతుకమ్మ,ఏర్గట్ల:మండల కేంద్రంలోని ఏర్గట్ల ఉన్నత పాఠశాలను జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఉపాధ్యాయుల బోధన ను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన సిలబస్ గురించి ఉపాధ్యాయులను,అడిగి తగు సూచనలు చేశారు. స్కూల్ విద్యార్థులు భోజనం చేసే సమయంలో భోజన సదుపాయాలను, అడిగి తెలుసుకుని, భోజనాన్ని, కూరలను, పరిశీలించి డీఈవో అశోక్ స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.వంట చేసే వంటశాల పరిసరాల్లో ఎలాంటి కలుషితం జరగకుండా చూడాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని...