29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ ప్రహారీ గోడ కూల్చివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ:బిచ్కుంద : ఎక్కడైనా ఖాళీ స్థలం దొరికిన, ఎక్కడైనా శిథిలావస్థకు చేరుకున్న గోడలు ఉంటే వాటిని పగలగొట్టి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు కొందరు. ఇక్కడ అక్కడ అనే మాట లేకుండా ఎక్కడ దొరుకుతే అక్కడ ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా చేసుకుంటున్నారు. వీరికి రాజకీయ అండదండలు, స్థానిక అధికారుల అండదండలు ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులు పరాయి వాళ్ళ చేతులకి వెళ్తున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రస్తుతం కీలక కేంద్రంగా జిల్లాలో మారింది. ఇంకేముంది ఇక్కడ కనిపిస్తే ప్రభుత్వ స్థలాలు వాటిని మింగేస్తున్నారు. బిచ్కుంద పట్టణంలోని పాత గ్రామపంచాయతీ చుట్టూ ప్రహరి గోడ ఉండడంతో దానిని కొందరు కూల్చివేసి దాన్ని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. అక్కడ చిన్నారుల అంగన్వాడి కేంద్రం ఉంది. దీని ముందే వాహనాలు నిలపడం, ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ సంబంధించిన ప్రహరి శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని కొంతమంది కూల్చివేశారు. కూల్చి వేసిన స్థలంలో కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని వాహనాలు పెట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారు. పక్కనే అంగన్వాడీ కేంద్రం ఉండడం వల్ల ఈ వాహనాల వల్ల భవిష్యత్తు ఏదైనా ప్రమాదం జరగవచ్చునని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ వివరణ కోరగా , త్వరలో ప్రహరీ కూలిన ప్రాంతంలో కంచె నిర్మిస్తామని, ప్రభుత్వ స్థలాలు వాహనాలకు వాడుకుంటే, కబ్జాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

More articles

Latest article