నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి. రాజశ్రీ చేతుల మీదుగా డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఆవిష్కరించినట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఘనపూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో ఉండి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. దీనికోసం ప్రతి ఒక్క యూనియన్ సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన తొందరగా పరిష్కరించాలని, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడాలని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, అసోసియేట్ అధ్యక్షులు యాదమ్మ, ఉపాధ్యక్షులు బేబీ రాణి, ప్రవీణ్ రెడ్డి, రవి గౌడ్, సాల్మన్ రాజు, దేవేందర్, గంగమని ,విజయ, కమల, రాజవ్వ యూనియన్ సభ్యులు ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.