నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్, పేయింటర్ కాలనీ ప్రాంతాల్లో సర్వే నెంబర్ 249, 250, 251 లో సర్కారు భూముల లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అదికారులు కూల్చివేశారు. గురువారం ఉదయం నిజామాబాద్ ఉత్తర మండల తహసీల్దార్ బి. విజయ్ కాంత్, స్థానిక ఎస్ఐ వెంకట్రావు ల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఇటివల కాలంలో స్థానికంగా భూ అక్రమణలు, అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగానికి పిర్యాదులు రావడం తో రెవిన్యూ శాఖ సర్వే నిర్వహించి అక్రమం అని నిర్థారించింది. అర్డిఓ రాజేందర్ అదేశాల మేరకు ఉదయం వేళ మూడు సర్వే నెంబర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.

