27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సేంద్రియ పసుపునకు విదేశాల్లో డిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎంపీ ధర్మపురి అర్వింద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సేంద్రియ పద్దతిలో పండించిన పసుపు పంటకు అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలోని వేణు మాల్ లో సోమవారం జాతీయ పసుపు బోర్డు తొలి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ… రైతులు పసుపు పంటను ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేంద్రియ తరహాలో పండించిన పంటలకు ముఖ్యంగా పసుపు పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. అనంతరం మోర్తాడ్ కు చెందిన లక్ష్మీ నర్సయ్య ఆర్గానిక్ పద్ధతిలో తన పొలం లో పండించిన ఆర్గానిక్ పసుపు పొడిని ఆర్మూర్ టర్మరిక్ బ్రాండ్ పేరు మీద విక్రయించడానికి ముందుకు రాగా ఎంపీ చేతుల మీదుగా ఆర్మూర్ టర్మరిక్ ను ప్రారంభించి యువరైతును ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవాని, కలెక్టర్ ఇలా త్రిపాటి, రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, వివిధ ఎఫ్పిఓ  లకు సంబంధించిన రైతులు, వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Demand for organic turmeric abroad
Demand for organic turmeric abroad

More articles

Latest article