సేంద్రియ పసుపునకు విదేశాల్లో డిమాండ్
. . . ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సేంద్రియ పద్దతిలో పండించిన పసుపు పంటకు అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలోని వేణు మాల్ లో సోమవారం జాతీయ పసుపు బోర్డు తొలి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... రైతులు పసుపు పంటను ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేంద్రియ తరహాలో పండించిన పంటలకు...