- పశువుల కాపరి మృతి
- గిరిరాజ్ కళాశాల గ్రౌండ్ లో ఘటన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వ్యక్తి ప్రాణాలు తీసింది. నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఈ నెల 19న జరిగిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగ చూసింది. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ సెకెండ్ ఇయర్, పైనల్ ఇయర్ విద్యార్ధులకు ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం డిగ్రీ పరీక్షలకు ఓ విద్యార్థి టిఎస్ 02 బి 4795 కారులో వచ్చారు. మధ్యాహ్నం కళాశాల మైదానంలో పార్క్ చేసి పరీక్షలకు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థి కారును అక్కడ నిద్రిస్తున్న పశువుల కాపరి దుబ్బకు చెందిన రమేష్ (50) పై నుంచి పోనిచ్చాడు. దానితో కారు చక్రాల కింద నలిగి రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని హుటా హుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. ఈ వ్యవహారం జరిగి 24 గంటలు గడిచిన పోలీసులు విషయంను బహిర్గత పరుచకపోవడం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

