. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు విశేష కృషి చేసిన నాయకుడు డి.శ్రీనివాస్ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ఎక్స్ రోడ్‌లో మాజీ పీసీసీ అధ్యక్షులు, డి. శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డి. శ్రీనివాస్ సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

